: చెవిపోగుల కోసం ముసలావిడ ఉసురు తీశారు
చెవిపోగుల కోసం ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హతమార్చారు. ఈ దారుణ ఘటన ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలంలోని ఇటిక్యాలలో చోటు చేసుకుంది. చెవిపోగులు తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తి వృద్ధురాలి నోట్లో పురుగుల మందు పోసి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.