: పరిగి ఎమ్మెల్యే ఈసీని తప్పుదోవపట్టించారు: కొప్పుల
ఎన్నికల కమిషన్ ను పరిగి శాసనసభ సభ్యుడు టి.రామ్మోహన్ రెడ్డి తప్పుదోవ పట్టించారని మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో ఏప్రిల్ 26 నాటికి 22.15 లక్షలు ఖర్చు చేసినట్టు స్వయంగా రామ్మోహన్ రెడ్డి టీటీఆర్ రికార్డు చేశారని అన్నారు. ఆ తరువాత చేవెళ్లలో జరిగిన సోనియా సభ ప్రచార ఖర్చు 14.30 లక్షల రూపాయలు జమ చేస్తే ఆయన నిర్దేశిత ఎన్నికల వ్యయాన్ని మించి ఖర్చు చేసినట్టు తేలిందని ఆయన ఆరోపించారు.
సోనియా ప్రచార వ్యయం తన ఖాతాలో చూపరనే ధీమాతో రామ్మోహన్ రెడ్డి పోలింగ్ కు మూడు రోజుల ముందు 22 లక్షల రూపాయలు ఖర్చయినట్టు పేర్కొన్నారని, దీనిని ధృవపరుస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా సంతకం చేశారని ఆయన వెల్లడించారు. సోనియా ప్రచార ఖర్చు కూడా ఆయన ఖాతాలోకే వెల్లడంతో రికార్డులు తారుమారు చేశారని కొప్పుల ఆరోపించారు.