: ఇందిరాపార్క్ లో ఆదర్శ రైతుల మహా ధర్నా


హైదరాబాదులోని ఇందిరా పార్కులో ఆదర్శ రైతులు మహా ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. తెలంగాణలో ఆదర్శరైతులను కొనసాగిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో వారిని తొలగించడం సరికాదని రఘువీరా అభిప్రాయపడ్డారు. ఆదర్శ రైతులను తొలగించాలన్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదర్శ రైతులంతా కాంగ్రెస్ కార్యకర్తలైతే ఏపీలో టీడీపీ ఎలా అధికారంలోకి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఆదర్శ రైతుల తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News