: చైనా పాల ఉత్పత్తుల దిగుమతిపై మరో ఏడాది నిషేధం


చైనా నుంచి దిగుమతి చేసుకునే పాల ఉత్పత్తులపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2015 జూన్ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది.'చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకునే పాల ఉత్పత్తుల (చాక్లెట్లు, చాక్లెట్ ఉత్పత్తులు, క్యాండీస్, కన్ఫెక్షనరీస్, పాలతో తయారుచేసే ఆహార పదార్థాలు) ఫై నిషేధాన్ని మరో సంవత్సరం పొడిగిస్తున్నాం. ఇది 23/6/2015 లేదా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఏది ముందైతే అంతవరకూ నిషేధం ఉంటుంది' అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్ టీ) ఓ నోటిఫికేషన్ లో తెలిపింది. ప్లాస్టిక్, ఫర్టిలైజర్స్ లో ఉపయోగించే మెలమైన్ అనే రసాయనం చైనా ఉత్పత్తుల్లో ఉండటంతో... 2008 సెప్టెంబర్ లో తొలిసారి ఈ నిషేధం విధించారు.

  • Loading...

More Telugu News