: ఇరాక్ కు భారత సైన్యమా... ఆ ఊహే లేదు: జైట్లీ


ఇరాక్ లో సున్నీ, షియా ముస్లింల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధాన్ని నియంత్రించేందుకు భారత సేనలను పంపుతారని వెలువడుతున్న వార్తలను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 'ఇరాక్ కు భారత సేనలా?' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనీసం ఆ ఊహ కూడా లేదని జైట్లీ తెలిపారు. ఇరాక్ లో సున్నీ చొరబాటు దారుల కారణంగా 120 మంది భారతీయులు చిక్కుకుపోయారని ఆయన వెల్లడించారు. ఇరాక్ లో 10 వేల మంది భారతీయులు ఉన్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News