: మాజీ మంత్రి సంగీత వెంకటరెడ్డి కన్నుమూత
సీనియర్ నేత, మాజీ మంత్రి సంగీత వెంకటరెడ్డి (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గతరాత్రి తుదిశ్వాస విడిచారు. వెంకటరెడ్డి తూర్పుగోదావరి జిల్లా పామర్రు, ఆలమూరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1979లో ఏపీ గనుల శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. గత జనవరిలో ఈయన వైఎస్సార్సీపీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పినపల్లి గ్రామం వెంకటరెడ్డి స్వస్థలం.