: బంజారాహిల్స్ ను వెనక్కినెట్టిన బెంజి సర్కిల్!
హైదరాబాద్ నగరానికి బంజారాహిల్స్ వాణిజ్యపరంగా గుండెకాయలాంటిది. ఎన్నో కార్పొరేట్ ఆఫీసులు, సెలబ్రిటీల నివాసాలు ఇక్కడ కొలువుదీరి ఉంటాయి. ఇక్కడ స్థలం కొనాలంటే చుక్కలు కనిపిస్తాయన్నది మధ్యతరగతి వర్గాల నిశ్చిత అభిప్రాయం. అయితే, రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు మారాయి. ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని వెతుక్కోవాల్సిన పరిస్థితి. విజయవాడ, గుంటూరు నడుమ రాజధాని వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఆ ప్రాంత రియల్ రేటు పెరిగిపోయింది.
విజయవాడ నడిబొడ్డు బెంజి సర్కిల్ లో చదరపు గజం ధర రూ.1 లక్షపైనే పలుకుతోంది. అదే, చదరపు గజం బంజారాహిల్స్ లో రూ.80 వేలే. భవిష్యత్ లో భారీగా డెవలప్ అవుతుందని భావిస్తున్న హైటెక్ సిటీలోనూ ఇదే పరిస్థితి. తాజా స్థితిగతులను సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగిన రియల్టర్లు విజయవాడ, గుంటూరు మధ్యలో స్థలాలకు కళ్ళు తిరిగే రేట్లు ఫిక్స్ చేసినట్టు సమాచారం.