: తల్లి కాంగ్రెస్ ని అంటే పిల్ల కాంగ్రెస్ కి ఎందుకు ఉక్రోషం: యనమల
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడంపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సమయంలో స్పీకర్ ఎంత సర్ది చెప్పినా ప్రతిపక్షం శాంతించలేదు. దీంతో ఆయన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమలను సభను శాంతపరచాల్సిందిగా సూచించారు. దీంతో యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, తల్లి కాంగ్రెస్ చేసిన దురాగతాలను సభ ముందుకు తీసుకువస్తుంటే పిల్ల కాంగ్రెస్ ఉక్రోషం పట్టలేకపోతోందని అన్నారు. అధికార పక్షం నేత మాట్లాడుతున్నప్పుడు అడ్డుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు.