: ఐదవ ఛార్జిషీటునే చివరిదిగా పరిగణించండి : వైఎస్ జగన్
అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన ఐదవ ఛార్జిషీటునే చివరి అభియోగపత్రంగా పరిగణించాలని ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టును కోరారు. ఈ మేరకు వీరు హైదరాబాదు నాంపల్లి సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. గతంలో ఈ కేసులో 7 అంశాలపై దర్యాప్తు చేసి, ఒకే ఛార్జిషీటు దాఖలు చేస్తామని సుప్రీం కోర్టుకు సీబీఐ హామీ ఇచ్చిందని మెమోలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడా హామీనీ సీబీఐ ఉల్లంఘించిందని తెలిపారు.