: కర్నూలులో ఆగస్టు 15 వేడుకలు: యనమల
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కర్నూలులో నిర్వహిస్తామని మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. అంతేకాకుండా, ఆగస్టులో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తామని కూడా తెలిపారు. రైతు రుణమాఫీపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని... కేంద్రప్రభుత్వాన్ని, ఆర్ బీఐని ఒప్పించి రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.