: అలాస్కా తీరంలో బలమైన భూకంపం


అమెరికాలోని అలాస్కా తీరంలో సోమవారం ఉదయం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.9గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికను విడుదల చేశారు. అయితే, తీర ప్రాంతాల్లో అంత భయంకరమైన అలలు వచ్చినట్లు సమాచారం లేదు. భూకంపం వచ్చిన నాలుగు గంటల తర్వాత సునామీ హెచ్చరికను ఉపసంహరించారు. ఆగ్నేయ లిటిల్ సిట్కిన్ ఐలాండ్ కు 13 మైళ్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అలాస్కా రాష్ట్ర హోంశాఖ ప్రతినిధి జెరెమీ జిడెక్ మాట్లాడుతూ... ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News