: విజ్డెన్.. 150 నాటౌట్!


ప్రఖ్యాత క్రికెట్ మ్యాగజైన్ 'విజ్డెన్' 150 వసంతాలను పూర్తిచేసుకుంది. క్రికెట్ ప్రపంచంలో 'విజ్డెన్'ను ఓ ప్రామాణిక పత్రికగా పరిగణిస్తారు. అయితే ఈ పత్రికను ఏడాదికి ఓసారి మాత్రమే ప్రచురిస్తారు. జాన్ విజ్డెన్ అనే ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఈ విశిష్ట పత్రికను 1863లో ప్రారంభించాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఏంచేయాలన్న జాన్ మహాశయుడి ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ 'విజ్డెన్' మ్యాగజైన్.

ఈ పత్రిక ముఖచిత్రంపై చోటు చేసుకోవడాన్ని ప్రతి ఒక్క క్రికెటర్ తమకు దక్కిన అపురూప గౌరవంగా భావిస్తారంటేనే అర్థమవుతోంది 'విజ్డెన్' గొప్పదనమేంటో. సునిశిత విశ్లేషణలు, నిక్కచ్చితనానికి నిదర్శనంలా నిలిచే ఇంటర్వ్యూలు, క్రికెట్ ను గురించిన సమగ్ర సమాచారం 'విజ్డెన్' ఈ స్థాయికి రావడంలో తోడ్పడ్డాయి. తొలినాళ్ళలో 112 పేజీలతో మార్కెట్లోకి వచ్చిన 'విజ్డెన్' నేడు 1500 పేజీలతో ఓ గ్రంథరాజంలా విపణిలో దర్శనమిస్తుంది.

  • Loading...

More Telugu News