: ఐసీసీ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఎన్నిక లాంఛనమే!
బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతల నుంచి తప్పుకోవాలని సుప్రీం కోర్టు హెచ్చరికకు గురైన ఎన్. శ్రీనివాసన్ ప్రపంచ క్రికెట్ పై తన పట్టు నిరూపించుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక దాదాపు ఖరారైంది. ఈ నెల 28న మెల్ బోర్న్ లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో అధ్యక్షుడిగా శ్రీనివాసన్ పేరు ప్రకటించనున్నారు. ఐపీఎల్-7 అవకతవకలపై దర్యాప్తు నేపథ్యంలో శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష విధులకు దూరంగా ఉండాలంటూ సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే.