: ఈ జీన్స్ ప్యాంట్ వేసుకుంటే మగువలకు పూర్తి భద్రత!
ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు భద్రత ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వారిని కాపాడే ఓ జీన్స్ ప్యాంట్ ను వారణాసికి చెందిన ఓ సాధారణ డ్రైవర్ కుమార్తె రూపొందించింది. ఆమె పేరు దీక్షాపాఠక్. ఈ జీన్స్ వేసుకున్నవారు ఆపద ఎదురైనప్పుడు దానికున్న బటన్ నొక్కితే చాలు. అందులో ఉన్న వాకీ టాకీ నుంచి ముందుగా సెట్ చేసుకున్న నెంబర్ కు కాల్ వెళ్లిపోతుంది. అవతలి వారు ఎత్తగానే ఇవతల వారి వాయిస్ వినిపిస్తుంది. ఒకవేళ కాల్ వచ్చినప్పుడు అవతలి నెంబర్ నుంచి ఎవరూ స్పందించకపోతే, పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్ వెళ్లిపోతుంది. ఓ వాకీ టాకీ, దానికి సిమ్ నెంబర్, సెన్సార్ మైక్ లను అమర్చడం ద్వారా దీక్షాపాఠక్ ఈ సురక్షితమైన జీన్స్ ప్యాంట్ ను తయారు చేసింది.