: అంతా 'అమ్మ' మయం!
తమిళనాడు సీఎం జయలలిత పేరిట మరో పథకం రంగ ప్రవేశం చేసింది. ఇప్పటిదాకా అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్ వాటర్, అమ్మ అది, అమ్మ ఇది అని... పథకాలు కోకొల్లలుగా ప్రవేశపెట్టారు. వాటికోవలో మరో పథకం వచ్చిచేరింది. ఈసారి వైద్యరంగంపై 'అమ్మ' దృష్టి సారించింది. 'అమ్మ మరుంతంగం' పేరిట చవకధరల ఫార్మసీలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిలో రాయితీ ధరలకు మందులు విక్రయిస్తారు. ఈ పథకానికి రూ.20 కోట్లు కేటాయించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి 100 ఏర్పాటు చేయాలని నిర్ణయించింది జయ సర్కారు. వీటిలో 10 షాపులు చెన్నైలోనే నెలకొల్పనున్నారు. ఈ బాధ్యతను సహకార శాఖకు అప్పగించారు. ప్రస్తుతం అధికారులు ఫార్మసీల ఏర్పాటు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. 'అమ్మ' ఆదేశం మరి!