: జగన్ లో ఎంతమార్పు... బాబు క్లాస్ ఫలితమేనా?
ఇన్నాళ్ళూ చంద్రబాబు యస్ అంటే తాను నో అనే జగన్ లో ఎంత మార్పు! నిన్నటివరకు బాబును అన్ని విషయాల్లో వ్యతిరేకించిన జగన్ నేడు సభలో విభిన్నరీతిలో స్పందించారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుపై బాబు పలు అంశాల గురించి మాట్లాడారు. వీటిపై జగన్ ప్రతిస్పందిస్తూ బాబుతో పోలవరం అంశంలో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. దీంతో, సభికుల్లో ఆశ్చర్యం కనిపించింది. కాగా, నిన్న చంద్రబాబు సభలో రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి మాట్లాడగా, దానికి జగన్ పలుమార్లు అడ్డుతగిలారు. అనంతరం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు!
'జగన్ మాట్లాడడం చూస్తుంటే, రాష్ట్రం సమస్యలేవీ లేకుండా సుభిక్షంగా ఉందని అందరూ అనుకుంటారు. అలా మాట్లాడితే కేంద్రం నుంచి అందే సాయంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. జగన్ రాజకీయ ప్రసంగాలు చేయడం మానుకోవాలి' అని హితవు పలికారు.