: 'గురుకుల్' భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత... పరిస్థితి ఉద్రిక్తం


వివాదాస్పద గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వెలసిన అక్రమ కట్టడాల కూల్చివేతకు జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో పలు భవనాలు కూల్చివేశారు. మాదాపూర్ లోని గురుకుల్ ట్రస్ట్ వద్ద ఈ ఉదయం అధికారులు భవనాల కూల్చివేతకు ఉపక్రమించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో, భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. అప్పట్లో గురుకుల్ ట్రస్ట్ కు కేటాయించిన 627 ఎకరాల్లో 350 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. 70 ఎకరాలు అయ్యప్ప సొసైటీకి బదలాయించారు. ప్రస్తుతం అయ్యప్ప సొసైటీలో నిర్మితమైన, నిర్మాణంలో ఉన్న భవనాల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ భూభాగోతంపై సీరియస్ గా దృష్టి సారించడంతో అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News