: హైదరాబాద్ బిర్యానీ... ఇది చాలా హాట్ గురూ!
హైదరాబాద్ అంటే ఠక్కున గుర్తొచ్చేది బిర్యానీ. నగరంలోని హోటళ్లలో హైదరాబాదు బిర్యానీని వేడివేడిగా వడ్డిస్తుంటే, భోజన ప్రియులు లొట్టలు వేసుకుంటూ లాగించేస్తుంటారు. అందుకే, హైదరాబాదులో ప్రతిరోజూ సుమారు రూ.20 లక్షల విలువైన బిర్యానీ అమ్మకాలు జరుగుతున్నాయని ఓ అంచనా. వీకెండ్ లో విక్రయాలు మరింత జోరందుకుంటాయని హోటళ్ళ నిర్వాహకులు చెబుతున్నారు. బాస్మతీ బియ్యం, శ్రేష్టమైన మాంసం, సుగంధ ద్రవ్యాలు, గరం మసాలా దట్టించి తయారు చేస్తుండటంతో హైదరాబాద్ బిర్యానీకి మంచి డిమాండ్ ఉంది. అన్నట్టు, హైదరాబాదులో పేరొందిన బిర్యానీ స్పెషల్ హోటల్స్ సుమారు 200 వరకు ఉన్నాయి.