: ఎరువులు, విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ అధికారుల దాడులు
ఆంధ్రప్రదేశ్ లోని ఎరువులు, విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 6.78 కోట్ల విలువైన 20,744 క్వింటాళ్ల విత్తనాలు, రూ. 31.45 కోట్ల విలువైన 33,312 క్వింటాళ్ల ఎరువులను సీజ్ చేసినట్లు వారు వెల్లడించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై 74 కేసులు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. ప్రకాశం, కర్నూలు జిల్లాలో ఎక్కువగా అక్రమాలు జరిగాయని వారు తెలిపారు. సోదాల్లో రూ. 61.34 లక్షల విలువైన పురుగు మందులను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.