: సంగారెడ్డిలో దారుణం
మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని హనుమాన్ నగర్ లో ఎనిమిదవ తరగతి చదువుతున్న స్వాతి (13) అనే బాలికపై కిరోసిన్ పోసి దుండగులు నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలైన స్వాతిని చికిత్స కొసం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు ప్రారంభించారు.