: ఎమ్మెల్యేలూ! ఆస్తులు, అప్పుల వివరాలు అందించండి
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు తమ ఆస్తులు, అప్పుల వివరాలను స్పీకర్ కు అందజేయాలని అసెంబ్లీ బులెటిన్ పేర్కొంది. వారు సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన నెల రోజుల లోగా ఆ వివరాలను సభాపతికి అందజేయాలని అసెంబ్లీ ఇన్ ఛార్జి కార్యదర్శి సత్యనారాయణ పేరుతో వెలువడిన బులెటిన్ కోరింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్తగా సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేయడంతో వారంతా జూలై 31వ తేదీలోగా తమ ఆస్తులు, అప్పుల వివరాలను అందజేయాలని పేర్కొంది.