: అరుదైన నాణెంతో సచిన్ కు యూకె సంస్థ గౌరవం
లండన్ కు చెందిన లగ్జరీ గూడ్స్ బ్రాండ్ 'ఈస్ట్ ఇండియా కంపెనీ' లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఫోటోతో ప్రత్యేక బంగారు నాణెంను ముద్రించింది. చట్టబద్ధంగా ముద్రించిన దాని విలువ 12వేల పౌండ్ల స్టెర్లింగ్. క్రికెట్లో సచిన్ 24 ఏళ్ల అద్భుతమైన కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నాణాన్ని జారీ చేసిందట. '200ల గ్రాముల బరువుతో 210 బంగారు నాణాలను ప్రపంచ వ్యాప్తంగా టెండూల్కర్ కు నివాళిగా జారీ చేస్తున్నాం. విశ్వవ్యాప్తంగా వేలమంది అభిమానులు కలిగి, స్టార్ హోదా ఉన్న చాలా తక్కువ మందినే ఈ నాణెంపై ముద్రిస్తాం' అని సదరు లండన్ కు చెందిన సంస్ధ ఓ ప్రకటనలో తెలిపింది.