: నల్లధనంపై సిట్ కు సమాచారం అందజేయండి: ఆర్బీఐ
నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా నల్లధనంపై సిట్ కు పూర్తి సమాచారం అందజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. విదేశాల్లో ఉన్న నల్లధనంకంటే ముందు దేశంలో ఉన్న నల్లధనం లెక్కతేల్చాలని ఆర్బీఐ భావిస్తోంది. దీంతో నల్లధనం డాక్యుమెంట్లు సిట్ కు అందజేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్ధలను ఆర్బీఐ ఆదేశించింది.