: జగన్ ను 17 సార్లు అడ్డుకున్నారు: శ్రీకాంత్ రెడ్డి
ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా, కనీస మర్యాద ఇవ్వకుండా, ఆయనను సంప్రదించకుండా శాసనసభను వాయిదా వేయడం సభాసంప్రదాయాలకు విరుద్ధమని వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షనేత హోదాలో గవర్నర్ ప్రసంగంపై మాట్లాడుతున్న జగన్ ను 17 సార్లు అడ్డుకున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. రేపు జగన్ ప్రసంగాన్ని కొనసాగనివ్వాలని వారు సూచించారు. విపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించినా, అధికార పక్షం, స్పీకర్ వ్యవహార శైలి సరిగా లేవని ఆయన ఆరోపించారు.