: 'హిట్ అండ్ రన్' కేసులో సల్మాన్ ను గుర్తించిన మరో ఇద్దరు సాక్షులు


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసులో ఈ రోజు మరో ఇద్దరు సాక్షులు ముంబయి సిటీ సెషన్స్ కోర్టు ఎదుట తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. 2002లో ఘటన చోటు చేసుకున్న సమయంలో అక్కడే ఉన్న ఒక సాక్షి అయిన డైరీ యజమాని తన వాంగ్మూలం చెప్పారు. సల్మాన్ అక్కడ ఉండటాన్ని తాను చూశానని తెలిపాడు. అయితే, డ్రైవర్ కు కుడి వైపు నుంచి సల్మాన్ కారు దిగడం చూసినట్లు వివరించాడు. కానీ, డ్రైవింగ్ సీట్లో వున్నది ఆయనో, కాదో చెప్పలేనన్నాడు. మరో సాక్షి వాంగ్మూలం ప్రకారం, ప్రమాదానికి కొన్ని గంటల ముందు కొంతమందితో కలసి సల్మాన్ బార్ కు రావడం తాను చూశానని పేర్కొన్నాడు. వీరిద్దరితో కలిపి తాజా విచారణలో మొత్తం పది మంది సాక్షులను విచారించారు. మళ్లీ ఈ కేసులో రేపు విచారణ జరగనుంది. ముంబయి సబర్బన్ బాంద్రాలో జరిగిన నాటి ఘటనలో పేవ్ మెంట్ పై నిద్రపోతున్న వారిపై కారు నడపడంతో ఒకరు మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News