: మహారాష్ట్ర సచివాలయంలో అగ్నిప్రమాదం
మహారాష్ట్ర సచివాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలోని సెక్రటేరియట్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని... 7 ఫైరింజన్లతో మంటలను అర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. సచివాలయంలోని సిబ్బందిని అధికారులు ఖాళీ చేయించారు.