: అందుకే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి: వాతావరణ శాఖ
ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో వైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడకపోవడంతో కోస్తాంధ్రలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.