: ఆ రైలు ప్రయాణికులు రెండు గంటల పాటు సొరంగంలో చిక్కుకుపోయారు!


కోల్ కతా నగరంలోని మెట్రో ప్రయాణికులకు ఇవాళ చేదు అనుభవం ఎదురైంది. మార్గమధ్యంలో రైలు ఆగిపోవడంతో రెండు గంటల పాటు వారు ఓ సొరంగంలో చిక్కుకున్నారు. నాన్ ఏసీ కావటంతో ప్రయాణికులు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. సౌత్ కోల్ కతాకు బయల్దేరిన ఈ రైలు ఇవాళ ఉదయం 11.30 గంటల సమయంలో పార్క్ స్ట్రీట్ స్టేషన్ దాటిన తర్వాత సొరంగంలోకి ప్రవేశించగానే ఆగిపోయింది. దీంతో ఆ మార్గంలో నడిచే ఇతర సర్వీసులకు ఆటంకం కలిగింది. రైల్వే అధికారులు నిచ్చెనలు ఏర్పాటు చేసి ప్రయాణికులను దించివేశారు. ప్రస్తుతం రైలు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News