: జెన్నిఫర్ లోపెజ్ కు తోడు దొరికింది!


'పాప్ క్వీన్ జెన్నిఫర్ లోపెజ్ ఇప్పుడు సింగిల్' అని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కాస్పర్ స్మార్ట్ తో విడివడి ఒంటరిగా ఉంటున్న లోపెజ్ ఇటీవలే కెమెరా కంటికి చిక్కింది. అయితే, ఆమె పక్కన డ్యాన్సర్ మాక్సిమ్ ష్మెర్కోవ్ స్కీ కూడా ఉండడం చర్చనీయాంశం అయింది. ఇటీవల లోపెజ్ సంగీత కచేరీలోనూ మనవాడు హాజరేయించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో లోపెజ్ తొందరగానే తోడు వెతుక్కుందని పాప్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మాక్సిమ్ ఇటీవల ఓ భారతీయ డ్యాన్స్ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు.

కాగా, తానిప్పుడు ఒంటరినని జూన్ 6న జె.లో. ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే మాక్సిమ్ తో కలిసి ఓ నైట్ క్లబ్ వద్ద కెమెరాలకు చిక్కింది. 2013లో అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ నైట్ కార్యక్రమంలో వీరిద్దరూ జంటగా ప్రదర్శన ఇచ్చారు. అప్పుడే వీరి పరిచయం జరిగిందట.

  • Loading...

More Telugu News