: ఇరాక్ లో అడుగుపెట్టిన అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రీ
అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రీ కల్లోలిత ఇరాక్ లో అడుగుపెట్టారు. సున్నీ మిలిటెంట్ల దాడులతో దద్దరిల్లుతున్న ఇరాక్ లో పరిస్థితులు చక్కదిద్దేందుకు ఆయన సలహాలు, సూచనలు అందించనున్నారు. జోర్డాన్ పర్యటన పిమ్మట ఆయన నేరుగా బాగ్దాద్ చేరుకున్నారు. ఇరాక్ ప్రధాని నూరి అల్-మాలికితో కెర్రీ భేటీ కానున్నారు. షియా వర్గానికి చెందిన మాలికిని ప్రధాని పదవి నుంచి తొలగిస్తే ఇరాక్ లో ఉద్రిక్తతలు చల్లబడతాయని అమెరికా సెనేట్ అభిప్రాయపడినా... కెర్రీ మాత్రం ఇరాక్ లో నాయకులను మార్చడం తమ విధి కాదని తేల్చి చెప్పారు. ఇరాక్ లోని ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నాయకత్వాన్ని అక్కడి ప్రజలే ఎన్నుకోవాలని, అది మాత్రమే అమెరికాకు హర్షణీయమని కెర్రీ పేర్కొన్నారు.