: మద్యం టెండర్లను అడ్డుకున్న డీవైఎఫ్ఐ కార్యకర్తల అరెస్ట్


హైదరాబాదులో మద్యం టెండర్ల లాటరీని డీవైఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. గుడి, బడి అనేది కూడా చూడకుండా... అన్నిచోట్లా మద్యం దుకాణాలు వెలుస్తున్నాయని ఆరోపిస్తూ వారు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో... కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News