: రాజీనామా చేస్తానన్న నాగాలాండ్ గవర్నర్
యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు పదవుల నుంచి వైదొలగాల్సిందేనని బీజేపీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగాలాండ్ గవర్నర్ అశ్వినీ కుమార్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తెలిపారు. ఈ నేపథ్యంలో నేడో, రేపో ఆయన రాజీనామా చేయనున్నారు. అయితే, పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణ్ తనకు కొంత సమయం కావాలని అడిగినట్టు సమాచారం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల గవర్నర్లు రాజీనామ చేసిన సంగతి తెలిసిందే.