: అమీర్ ఖాన్ కు అవార్డుకు బదులుగా స్వీట్ ప్యాకెట్


అవార్డులు, ఉత్సవ కార్యక్రమాలకు దూరంగా ఉండే బాలీవుడ్ సినీ నటుడు అమీర్ ఖాన్ ముంబైలో జరిగిన 'స్టార్ పరివార్' అవార్డుల ప్రదాన కార్యక్రమానికి హాజరయ్యారు. పలువిభాగాల్లో ప్రకటించిన అవార్డులను తిలకించిన అమీర్ ఖాన్, అవార్డుకు బదులుగా స్వీట్ ప్యాకెట్ అందుకున్నారు. వినోదం పంచడమే కాకుండా సామాజిక బాధ్యతతో దేశం ఎదుర్కొంటున్న పలు సామాజిక సమస్యలపై అమీర్ ఖాన్ రూపొందించిన 'సత్యమేవ జయతే' కార్యక్రమానికి ఆయన ఈ గౌరవం అందుకున్నారు. స్వీట్ ప్యాకెట్ తో తనను గౌరవించడం చాలా నచ్చిందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News