: సూరీడు చెప్పిన నిప్పులాంటి నిజాలు!


జగన్ అక్రమాస్తుల కేసులో వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సంచలనాత్మక కేసులో కేవీపీ పాత్ర ఎంతమేరకు అన్నది స్పష్టం కాలేదన్నది సుస్పష్టం. కానీ, వైఎస్ నీడ సూరీడు ఈ కేసులో కీలక సాక్షి అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడా సూరీడు వైఎస్ హయాంలో చోటు చేసుకున్న పలు అవినీతి భాగోతాలపై నోరు విప్పినట్టు సమాచారం. సీబీఐ చేతిలో ఉన్న ఆ వివరాలు కేవీపీని నిందితుడిగా నిలబెట్టేందుకు సరిపోతాయని తెలుస్తోంది.

ఇంతకీ సూరీడు చెప్పిన నిప్పులాంటి నిజాలేంటంటే.. వైఎస్ ను కలిసేందుకు ఎవరొచ్చినా ముందు కేవీపీ వద్ద అపాయింట్ మెంట్ తీసుకోవాలట. కేవీపీ వద్ద స్క్రీనింగ్ టెస్టు పాసయితేనే వైఎస్ తో భేటీ సాధ్యమయ్యేది. దానర్థం, సదరు వ్యక్తి ఏమైనా ఉపయోగపడతాడా? లేదా? అనేది కేవీపీ చూసుకునేవాడని తెలుస్తోంది. ఆ వ్యక్తి వల్ల ఏమైనా 'ఉపయోగం' ఉంటుందని తెలిస్తే ఇక అతనికేమి కావాలో వైఎస్ చూసుకునేవాడు. ఎంతటి భారీ ఒప్పందంలోనైనా ఇదే తంతు. వైఎస్ ను నేరుగా కలిసేందుకు ప్రయత్నించినా ఆయన సైతం కేవీపీని దర్శించుకోమనే సూచించేవారట. దీన్నిబట్టి అర్థమవుతోంది కేవీపీ ఎలాంటి పాత్ర పోషించాడో !!.

  • Loading...

More Telugu News