: రేపు ప్రీతిజింటాను విచారించనున్న పోలీసులు
వేధింపుల కేసులో నటి ప్రీతిజింటాను ముంబై పోలీసులు రేపు విచారించనున్నారు. మే 30న ముంబైలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తనను మాజీ ప్రియుడు నెస్ వాడియా వేధించినట్లు ఆమె ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి నిన్ననే తిరిగొచ్చింది. దీంతో ప్రీతి జింటా నుంచి మరింత సమాచారాన్ని పోలీసులు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్టేట్ మెంట్ ను రేపు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఐపీఎల్ సీవోవో సుందర్ రామన్ సహా పలువురి సాక్ష్యాలను పోలీసులు నమోదు చేశారు. ప్రీతి ఆరోపణలను సుందర్ రామన్ పోలీసుల వద్ద ధ్రువీకరించినట్లు సమాచారం.