: స్టార్ అలయెన్స్ లో ఎయిరిండియాకు చోటు


ప్రపంచస్థాయి ఎయిర్ లైన్స్ సంస్థల గ్రూపు స్టార్ అలయెన్స్ లో భారత ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా స్థానం సంపాదించింది. ఈ గ్రూపులో వివిధ దేశాలకు చెందిన 26 విమానయాన సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. స్టార్ అలయెన్స్ లో సభ్యత్వం ద్వారా ఎయిరిండియా 1200 గమ్యస్థానాలకు విమానాలు నడిపే వీలు కలుగుతుంది. ఈ మేరకు నేడు లండన్ లో సమావేశమైన స్టార్ అలయెన్స్ బోర్డు ఎయిరిండియాకు సభ్యత్వాన్ని ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2007లోనే ఎయిరిండియాకు ఈ అవకాశం దక్కినా, అప్పట్లో ఇండియన్ ఎయిర్ లైన్స్ తో విలీన ప్రక్రియ కొనసాగుతున్నందున సభ్యత్వాన్ని నిలిపివేశారు.

  • Loading...

More Telugu News