: రుణమాఫీపై చిత్తశుద్ధి ఉంటే... కమిటీ ఎందుకు?: జగన్


రుణమాఫీపై చిత్తశుద్ధి ఉంటే కనుక 'కోటయ్య కమిటీ' అంటూ కమిటీ వేసి, టీడీపీ ప్రభుత్వం కాలయాపన చేయదని వైఎస్సార్సీపీ అద్యక్షుడు జగన్ విమర్శించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రతి మూడు నెలలకోసారి బ్యాంకర్లంతా కూర్చుని క్రోడీకరించి రైతు రుణాలు, డ్వాక్రా రుణాలపై పూర్తి సమాచారంతో ఓ పుస్తకాన్ని విడుదల చేస్తారని తెలిపారు. రైతుల అప్పులు, డ్వాక్రా రుణాలపై పూర్తి సమాచారం ఆ పుస్తకంలో ఉండగా, కోటయ్య కమీటీ కొత్తగా ఏం కనిపెడుతుందని ఆయన ప్రశ్నించారు. ఆయా అప్పుల వివరాలను జిల్లాల వారిగా విడుదల చేశారని ఆయన తెలిపారు.

ఈ పుస్తకం టీడీపీ విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణస్వీకారం చేయడానికి, రైతు రుణమాఫీ ఫైలుపై సంతకం పెట్టడానికి రెండు రోజుల మందు విడుదలైందని ఆయన వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ మొదలవడంతో రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని... దీంతో రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరకు పరిగెడుతున్నారని చెప్పారు. అప్పులపాలైపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రైతు రుణాలు మాఫీ చేయాలని, అందుకు పూర్తిగా సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News