: లియాండర్ పేస్ పై గృహ హింస, వేధింపుల కేసు
ముంబయిలోని స్థానిక మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ పై మోడల్ రియా పిళ్ళై గృహ హింస, వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ విషయాన్ని పేస్ తరపు న్యాయవాది మీడియాకు తెలిపారు. పేస్, అతని తండ్రి వేస్ పేస్ పై రియా కేసు నమోదు చేసిందన్నారు. అంతేగాక, తన నెలవారి నిర్వహణకు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరినట్టు వెల్లడించారు. ఈ నెల 30న దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే తమ ఎనిమిదేళ్ల కుమార్తె కోసం వారిద్దరి మధ్య ఘర్షణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత నెలలో తన కుమార్తె రక్షణ బాధ్యతలు రియా నుంచి శాశ్వతంగా తనకే ఇవ్వాలంటూ ఫ్యామిలీ కోర్టులో పేస్ పిటిషన్ దాఖలు వేశారు.