: ప్లీజ్! మళ్లీ అధికారమివ్వండి... ఈసారి ఐదేళ్లు సేవ చేస్తా: కేజ్రీవాల్
గతేడాది చివరిలో అనూహ్యంగా ఢిల్లీ గద్దెనెక్కి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నెల రోజులే పాలించింది. ఆ వెంటనే ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ రాజీనామ చేయడం, రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టడం జరిగిపోయాయి. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల్లో భంగపాటు ఎదుర్కొన్న కేజ్రీ ఢిల్లీలో మళ్లీ తమకే అధికారమివ్వాలని నగరవాసులను విజ్ఞప్తి చేస్తున్నారు. ఈసారి ఐదేళ్లు పదవిలో ఉండి సేవ చేస్తానని చెబుతున్నారు. ఈ మేరకు ఉత్తర ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఓటర్లకు క్షమాపణ చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 40కి పైగా స్థానాలు తమకివ్వాలని కోరారు. గతంలో జరిగిన దాన్ని మర్చిపోవాలని, తను రాజీనామా చేయడం తప్పేననీ అన్నారు. అందుకే మళ్లీ సింపుల్ మెజారిటీతో స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వాలని అడిగారు.