: ఏపీలో ఐఆర్ఎస్ అకాడమీ ఏర్పాటుకు కేంద్రం హామీ


ఆంధ్రప్రదేశ్ లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అకాడమీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు ఐఆర్ఎస్ రిక్రూట్స్ ట్రెయినింగ్ అకాడమీని అనంతపురం లేదా చిత్తూరు జిల్లాలో కేంద్రం ఏర్పాటు చేయనుందట. దానిని ఏర్పాటు చేస్తే 150 ఎకరాల స్థలం కేటాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. కాగా, ఇది దేశంలోనే తొలి ఐఆర్ఎస్ శాశ్వత అకాడమీ అవనుంది. ఇదేగాక ఏపీ కొత్తగా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు సంబంధించి స్థలాల ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏపీ రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో... ఆధునిక వైద్య సౌకర్యాలతో కూడిన ప్రతిష్ఠాత్మకమైన ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రిని విజయవాడలో నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News