: ఎయిర్ పోర్టులో ఏడున్నర కిలోల బంగారం సీజ్
విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు కిలోల కొద్దీ బంగారాన్ని పట్టుకుంటున్నా... విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా చెన్నై విమానాశ్రయంలో అక్రమంగా తీసుకువచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి మొత్తం 7.5 కిలోల పుత్తడిని పట్టుకున్నారు. వీరు కోల్ కతా వాసులని అధికారుల విచారణలో వెల్లడైంది.