: కక్ష సాధింపు వద్దు... చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించండి: అఖిలపక్షం
టీవీ9, ఏబీఎన్ చానళ్ల ప్రసారాలను తెలంగాణలో నిలిపివేయడాన్ని వివిధ పార్టీల నేతలు తప్పుబట్టారు. కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. వెంటనే ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు వరంగల్ జిల్లా హన్మకొండలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు.