: మోడీని ప్రశ్నించేందుకు పవన్ రెడీ అవుతున్నారా?
తెరమీదే కాదు, తెర వెలుపలా ఆవేశం ప్రదర్శించే హీరో పవన్ కల్యాణ్. అయితే ఆయన ఆవేశం వెనుక ఆలోచన ఉంటుంది. జనసేన పేరుతో పార్టీ పెట్టి ఎన్నికలకు దూరంగా ఉన్నా, తన సత్తా నిరూపించుకోవడం అందుకు నిదర్శనం. 'ఎవరినైనా ప్రశ్నిస్తాడు' అన్నది ఆయన పేరుకు ట్యాగ్ లైన్ అనుకుంటే, అందుకు సమయం ఆసన్నమైందని రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న టాక్. రైల్వే ఛార్జీలు పెంచి దేశవ్యాప్త నిరసనలకు కారణమైన ప్రధాని మోడీని ప్రశ్నించేందుకు పవర్ స్టార్ సన్నద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మోడీ... పవన్ కు ఏం జవాబిస్తారు? ఆయనను బుజ్జగిస్తారా? లేక, తన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? అన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
ఎన్నికల ప్రచారం వేళ మోడీ, చంద్రబాబు వంటి రాజకీయ ఉద్ధండులతో వేదిక పంచుకున్న ఈ వెండితెర కథానాయకుడు ఇప్పుడు తన ట్యాగ్ లైన్ కు న్యాయం చేస్తాడా? లేదా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!