: పోలీసుల ఎన్ కౌంటర్ లో ఓ గెరిల్లా కమాండర్ హతం


జమ్మూ కాశ్మీర్ లో లష్కర్-ఏ-తోయిబాకు చెందిన విదేశీ గెరిల్లా కమాండర్ కు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కమాండర్ చనిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన సోపోర్ పట్టణంలో జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన విదేశీ కమాండర్ ను మహబూబ్ భాయ్ గా గుర్తించినట్లు సీనియర్ పోలీస్ అధికారి మీడియాతో చెప్పారు.

జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలోని ఓ ఇంట్లో ఇద్దరు, ముగ్గురు గెరిల్లాలు తలదాచుకున్నట్లు నిఘా హెచ్చరిక వర్గాలు వెల్లడించాయి. దీంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసిన సమయంలో గెరిల్లాలు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరపడంతో ఓ గెరిల్లా కమాండర్ చనిపోయాడు.

  • Loading...

More Telugu News