: నేను క్షేమం ... తల్లికి అంజలి ఫోన్!
సినీనటి అంజలి క్షేమంగా వుంది. ఈ మేరకు ఆమె కొంతసేపటి కిందట తన తల్లికి ఫోన్ చేసి తన క్షేమ సమాచారాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు తన చెల్లి అదృశ్యమైందంటూ సోదరుడు రవిశంకర్ నిన్న జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాంతో, అంజలిపై ఇచ్చిన మిస్సింగ్ కేసును వెనక్కి తీసుకోవాలని అంజలి తల్లి కొడుక్కి సూచించినట్లు తెలుస్తోంది. తన పిన్ని భారతి, తమిళ దర్శకుడు కళంజియం డబ్బుకోసం తనను ఏటీఎమ్ లా వాడుకుంటున్నారంటూ రెండురోజుల కిందట నటి అంజలి ఆరోపించిన సంగతి తెలిసిందే.