: వరల్డ్ కప్ కు ముందు ఆసీస్ తో టీమిండియా ట్రై సిరీస్
వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ టోర్నీ ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు రెండు దేశాల్లోని వివిధ వేదికలపై జరగనుంది. ఈ నేపథ్యంలో, పరిస్థితులకు అలవాటు పడేందుకని టీమిండియా ముందుగానే ఆస్ట్రేలియా వెళ్ళనుంది. అక్కడ ఆసీస్ తో టెస్టు సిరీస్ తో పాటు ఓ ట్రై సిరీస్ ఆడనుంది. భారత్, ఆసీస్ లతో పాటు ఇంగ్లండ్ మూడో జట్టుగా ఈ ట్రై సిరీస్ లో పాల్గొంటుంది. ఈ ఏడాది డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 1 వరకు పర్యటన కొనసాగుతుంది. అనంతరం టీమిండియా అక్కడే ఉండి వరల్డ్ కప్ సన్నాహాల్లో పాల్గొంటుంది.