: అసెంబ్లీలో జగన్ పై ధూళిపాళ్ల ధ్వజం
గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా భూ కేటాయింపులు జరిగాయని... ఖనిజాలను అక్రమంగా దోచుకునేందుకు సహాయ సహకారాలు అందాయని టీడీపీ నేత ధూళిపాళ్ల ఆరోపించారు. ఐఏఎస్ అధికారులు సైతం జైళ్లకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటిపై విచారణ చేయించి... ఏం జరిగిందో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. అందుకే వీటన్నింటిపై దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు. ఎవరి వ్యక్తిగత జీవితాలపైన తాను మాట్లాడటం లేదని... గత ప్రభుత్వ అడ్డగోలు విధానాలపైనే మాట్లాడుతున్నానని చెప్పారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి బంధువులకు సంబంధించి 43 వేల కోట్ల రూపాయలు క్విడ్-ప్రో-కో కింద చేతులు మారాయని నివేదికలు చెబుతున్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయాలపై సిగ్గుపడాలని ధూళిపాళ్ల అన్నారు. మీ తండ్రి స్కీంలకు మాత్రమే మీరు వారసులా?... స్కాంలకు వారసులు కారా? అంటూ జగన్ ను నిలదీశారు.