: మహిళల హెల్ప్ లైన్ కు పురుషుల ఫోన్ కాల్స్!
అక్కడ సీన్ రివర్సైంది. మహిళలకు సాయం చేసేందుకు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు పురుషుల ఫోన్ కాల్స్ వెల్లువెత్తుతున్నాయట. మధ్యప్రదేశ్ లోని గౌరవిలో మహిళలపై వేధింపుల వ్యతిరేక కేంద్రం ఏర్పాటు చేశారు. యాక్షన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్థానిక జైప్రకాశ్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ లైన్ కేంద్రం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పాల్గొన్నారు. ఇంత ఘనంగా ప్రారంభమైన ఈ కేంద్రానికి మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఫోన్ చేస్తున్నారట. 'ఇంట్లో భార్యల వేధింపులు భరించలేకపోతున్నాం, అర్జెంటుగా రక్షించండి' అన్నదే ఆ ఫోన్ కాల్స్ సారాంశం.
అయితే, పురుషుల సమస్యలు పరిష్కరించడం ఈ హెల్ప్ లైన్ విధివిధానాల్లో లేకపోవడంతో, ఇలాంటి ఫోన్ కాల్స్ పై స్పందించలేకపోతున్నారు సదరు సిబ్బంది. పరిస్థితి చూస్తుంటే మగాళ్ళకూ ఓ హెల్ప్ లైన్ పెట్టాల్సి వచ్చేట్టుంది మధ్యప్రదేశ్ లో!