: అసెంబ్లీలో వాడివేడిగా చర్చ... జగన్, కాల్వ, ధూళిపాళ్ల పరస్పర విమర్శలు


దివంగత వైఎస్ పై నిందలు వేయడం సరికాదని వైకాపా అధినేత జగన్ అన్నారు. సభకు రాలేని వ్యక్తిపై అభాండాలు వేయడం మంచి పద్ధతి కాదని సూచించారు. ప్రతిపక్షంలో తామున్నది ప్రతి విషయంపై ప్రశ్నించడానికి కాదని... ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడానికని చెప్పారు. మంచి చేయండి... మనస్పూర్తిగా మద్దతిస్తామని తెలిపారు. ఇతర విషయాల జోలికి వెళ్లకుండా... గవర్నర్ ప్రసంగంపై చర్చను కొనసాగిస్తే బాగుంటుందని అన్నారు. వైఎస్, వైకాపాలపై విమర్శలు గుప్పించిన ధూళిపాళ్ల, కాల్వ శ్రీనివాసులుపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రసంగం మధ్యలో ఒకానొక సమయంలో రాజీనామాలకు సంబంధించిన సవాళ్ల వరకు వెళ్లారు.

  • Loading...

More Telugu News