: వాడిని గుర్తించాం...పట్టుకుంటాం: డీసీపీ త్రిపాఠి


చార్మినార్ వద్ద ఒడిశాకు చెందిన డీఆర్ డీవో శాస్త్రవేత్త సత్యపతిపై దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించామని దక్షిణ మండల డీసీపీ త్రిపాఠి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సత్యపతిపై బ్లేడుతో దాడి చేసిన వ్యక్తి మైనర్ బాలుడని, అతనిపై గతంలో కేసులున్నాయని అన్నారు. సత్యపతిని ఉస్మానియా ఆసుపత్రి నుంచి కంచన్ బాగ్ లోని డీఆర్ డీవో అపోలో ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు. చార్మినార్ పరిసరాల్లో దొంగలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పారు.

  • Loading...

More Telugu News